ఈ టూల్ ఏం చేస్తుంది?

మీ ఛానల్ టాపిక్ రాయండి, ఉదాహరణకు "Canva tutorials" లేదా "తెలుగు వంటలు". టూల్ 10 వీడియో ఐడియాస్ ఇస్తుంది. ప్రతి ఐడియాకి ఒక టైటిల్, అది ఎందుకు పనిచేస్తుందో ఒక లైన్ ఉంటుంది.

ఐడియా ఎంత బాగుంటే అంత మంచిది

చిన్న ఛానల్స్ లో కొన్ని వీడియోలే ఎక్కువ views తెస్తాయి. నా పది ఎక్కువ views ఉన్న తెలుగు వీడియోలు పోల్చి చూస్తే, రెండు వీడియోలే మూడింట రెండు వంతుల views తెచ్చాయి. రెండూ ప్రజలు ఇప్పటికే search చేస్తున్న ఒక specific ప్రశ్నకు సమాధానం ఇచ్చినవే.

లిస్ట్ నుంచి ఎలా ఎంచుకోవాలి?

  • ఐడియాని YouTube search లో టైప్ చేయండి. Suggestions వస్తే ప్రజలు వెతుకుతున్నారని అర్థం.
  • టాప్ results పాతవా, వేరే భాషలోనా? అయితే మంచి తెలుగు వీడియోకి చాన్స్ ఉంది.
  • మీ ఫోన్ తో step by step చూపించగలిగే ఐడియాస్ ఎంచుకోండి.

ఈ టూల్ live YouTube data చూడదు, AI తప్పు చేయొచ్చు. ఐడియాస్ ని brainstorm గా వాడండి. మీ వీడియోల comments లో వచ్చే ప్రశ్నలు కూడా మంచి ఐడియాస్.

రాసింది Naveen Kodali, Creator Toolkit founder.

తరచుగా అడిగే ప్రశ్నలు

తెలుగులో ఐడియాస్ వస్తాయా?

అవును. తెలుగు, English లేదా Mix ఎంచుకోండి.

ఇవి live YouTube data నుంచి వస్తాయా?

లేదు. AI నుంచి వస్తాయి. ఫిల్మ్ చేసే ముందు YouTube search లో చెక్ చేయండి.

మళ్ళీ నొక్కితే కొత్త ఐడియాస్ వస్తాయా?

అవును. ఇంకా specific టాపిక్ రాస్తే ఇంకా మంచి ఐడియాస్ వస్తాయి.

ఉచితమా?

అవును, పూర్తిగా ఉచితం.