ఈ టూల్ ఏం చేస్తుంది?
మీ వీడియో టాపిక్ ఒక లైన్ లో రాయండి, భాష ఎంచుకోండి. టూల్ మీకు చాలా టైటిల్ ఆప్షన్స్ ఇస్తుంది. వాటిలో మీ వీడియోకి సరిపోయేది ఎంచుకోండి, లేదా రెండు మూడు ఐడియాలు కలిపి మీ స్టైల్ లో రాసుకోండి.
మూడు భాషా ఆప్షన్స్
- Mix: తెలుగు పదాలు తెలుగు లిపిలో, Canva, Instagram లాంటి tool పేర్లు English లో. చాలా మంది తెలుగు వ్యూయర్స్ ఇలాగే search చేస్తారు.
- English: పూర్తిగా English టైటిల్స్.
- తెలుగు: పూర్తిగా తెలుగు లిపిలో, పెద్ద brand పేర్లు మాత్రమే English లో.
మంచి టైటిల్ కోసం చిట్కాలు
- ముఖ్యమైన keyword మొదటి కొన్ని పదాల్లో పెట్టండి. ఫోన్ లో దాదాపు 60 అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి.
- వీడియోలో లేనిది టైటిల్ లో promise చేయకండి. వ్యూయర్స్ త్వరగా వెళ్ళిపోతే reach తగ్గుతుంది.
- "Telugu" అనే పదం టైటిల్ లో పెడితే, తెలుగు వీడియో కోసం search చేసేవాళ్ళకి కనిపిస్తుంది.
నిజమైన ఉదాహరణ
నా వీడియో "Earn Money with Canva: A Step-by-Step Guide Telugu" కి దాదాపు 39,500 views వచ్చాయి. అందులో 60% views YouTube search నుంచే. టైటిల్ మొదటి పదాల్లోనే ఫలితం (earn money), tool (Canva), format (step-by-step) మరియు భాష (Telugu) ఉన్నాయి. అదే ఈ టూల్ ఫాలో అయ్యే పద్ధతి.
రాసింది Naveen Kodali, Creator Toolkit founder.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ టైటిల్ జనరేటర్ ఉచితమా?
అవును. పూర్తిగా ఉచితం, sign-up అవసరం లేదు.
తెలుగులో టైటిల్స్ వస్తాయా?
అవును. తెలుగు, English లేదా తెలుగు + English Mix లో టైటిల్స్ వస్తాయి.
YouTube టైటిల్ ఎంత పొడవు ఉండాలి?
గరిష్ఠం 100 characters. కానీ ఫోన్ లో దాదాపు మొదటి 60 మాత్రమే కనిపిస్తాయి, కాబట్టి ముఖ్యమైన విషయం ముందు పెట్టండి.
Shorts టైటిల్స్ కి కూడా పనిచేస్తుందా?
అవును. మీ Short టాపిక్ రాస్తే చిన్న, పదునైన టైటిల్స్ వస్తాయి.