డిస్క్రిప్షన్ ఎందుకు ముఖ్యం?

మీ వీడియో దేని గురించో YouTube అర్థం చేసుకోవడానికి డిస్క్రిప్షన్ సహాయం చేస్తుంది. సరైన keywords ఉంటే search లో, suggested videos లో కనిపించే అవకాశం పెరుగుతుంది. కానీ ప్రతి వీడియోకి కొత్తగా రాయడం టైమ్ తీసుకుంటుంది. ఈ టూల్ కొన్ని సెకన్లలో మంచి draft ఇస్తుంది.

ఎలా వాడాలి?

వీడియో టాపిక్, మీ ఛానల్ పేరు, ముఖ్యమైన keywords రాయండి. భాష ఎంచుకుని Generate నొక్కండి. వచ్చిన డిస్క్రిప్షన్ ని చదివి, మీ వీడియోకి సరిపోని వాక్యాలు మార్చండి. తర్వాత YouTube Studio లో paste చేయండి.

మంచి డిస్క్రిప్షన్ కోసం చిట్కాలు

  • మొదటి ఒకటి రెండు లైన్లలోనే ముఖ్యమైన keyword పెట్టండి. "...more" ముందు అవే కనిపిస్తాయి.
  • వీడియోలో ఏం నేర్చుకుంటారో 2-3 చిన్న పేరాల్లో రాయండి.
  • Chapters (0:00 Intro లాంటివి) జోడించండి. మా Chapters Formatter తో సరిచేయవచ్చు.
  • 3 నుంచి 5 hashtags చాలు. 15 కంటే ఎక్కువ పెడితే YouTube అన్నింటినీ పట్టించుకోదు.

రాసింది Naveen Kodali, Creator Toolkit founder.

తరచుగా అడిగే ప్రశ్నలు

డిస్క్రిప్షన్ తెలుగులో వస్తుందా?

అవును. తెలుగు, English లేదా Mix లో వస్తుంది.

YouTube డిస్క్రిప్షన్ ఎంత పొడవు ఉండొచ్చు?

గరిష్ఠం 5,000 characters. కానీ మొదటి లైన్లు అన్నింటికంటే ముఖ్యం.

వచ్చినది అలాగే వాడొచ్చా?

Draft గా వాడండి. చదివి, మీ వీడియోకి తగ్గట్టు మార్చి పెట్టండి.

ఉచితమా?

అవును, పూర్తిగా ఉచితం.